
ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇటీవల వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెళ్లి వచ్చిన ఆయన..మరుసటి రోజు నుంచే జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది జూన్‌లో కరోనాని జయించిన బండ్ల గణేశ్, మళ్లీ ఇప్పుడు రెండోసారి కరోనా బారిన పడటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి:
కరోనా కలకలం: దిల్ రాజు ఎంత పనిచేశావ్..