బండ్ల గణేశ్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అని అందరికి తెలిసిందే. ఏ చిన్న సందర్భం దొరికినా చాలు మెగా హీరోలను ఓ రేంజ్‌లో పొగిడేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటాడు ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్. ఇక పవన్ కల్యాణ్ విషయంలో అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తాను రెండోసారి కరోనా బారిన పడిన సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఒక్క రోజు ఆలస్యమైనా ప్రాణాలు పోయేవని, అలాంటి సమయంలో చిరంజీవి తనకు అండగా నిలిచారని బండ్ల గణేశ్ అన్నారు.
(చదవండి: చిరు సాయం లేకుంటే హేమ చనిపోయేది.. రాజా రవీంద్ర షాకింగ్ కామెంట్)
‘రెండోసారి కరోనా బారిన పడినప్పుడు నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఒక్క రోజు లేట్ అయితే చనిపోయేవాడిని. ఆ సమయంలో ఆస్పత్రిలో బెడ్ కూడా దొరకని పరిస్థితి. నాతో పాటు మా కుటుంబం అంతా కరోనా బారిన పడింది. మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేద్దామనుకున్నా. కానీ అప్పటికే ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసి చేయలేకపోయాను. ఎవరికి చేయాలో తెలియక చివరకు చిరంజీవికి ఫోన్ చేశా. ఫస్ట్ రింగ్‌కే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు గణేశ్ అన్నాడు. నోట మాట కూడా రాని ఆ పరిస్థితుల్లో చిరంజీవి సాయపడ్డారు. చిరంజీవి సాయంతోనే నేను ఈ రోజు బతికి ఉన్నా. లేదంటే ఎప్పుడో నేను చనిపోయేవాడ్ని. పవన్ కల్యాణ్ నాకు జీవితాన్ని ఇస్తే.. చిరంజీవి నాకు ప్రాణం పోశారు. ఆయన రుణం తీర్చుకోలేను. అందరికి ముందు ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. జీవితాంతం ఆయనకు నేను రుణపడి ఉంటాను’ అంటూ బండ్ల గణేశ్ ఎమోషన్ అయ్యాడు.
(చదవండి: బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?)
Comments
Please login to add a commentAdd a comment