సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మండిపడ్డారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆపార్టీని విమర్శించొద్దు. సీఎం ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్‌ను చంపేశారు. ఆయన పేరుమీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తుంది. జానారెడ్డి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా ?. లిక్కర్ స్కాంలో అక్రమ సంపాదన చేయలేదా ?’’ అని బండ్ల గణేష్ ధ్వజమెత్తారు.
లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసింది మీరు కాదా ?. బీసీల కోసం మీ త్యాగం అవసరం లేదు. ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. మీ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తే కొండా లక్ష్మణ్ బాపూజీని మీరు పట్టించుకున్నారా ? సీఎం కావాలని మీరు.. కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదని.. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడండి. రెస్ట్ తీసుకోండి...ఏం తప్పు చేశారో తెలుసుకోండి. ప్రెస్ మీట్లు బంద్ చేయండి.. అసహ్యించుకుంటున్నారు’’ అంటూ బండ్ల గణేష్ విమర్శించారు.
జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?... పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావు కవితమ్మ..?
— Congress for Telangana (@Congress4TS) February 3, 2024
-- కాంగ్రెస్ నేత సినీనిర్మాత, బండ్ల గణేష్
Did you remember now to put up a statue of Jyoti Rao Phule? Kavitha, what did you do after being in the government for ten years?… pic.twitter.com/tMaGTOeYbi
Comments
Please login to add a commentAdd a comment