మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకుసున్నాడు. తాను ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని స్పష్టం చేశాడు. అంతేకాదు ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ వెల్లడించాడు.
(చదవండి: జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా..నేనెంటో చూపిస్తా: బండ్ల గణేష్)
బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. తాజాగా ఆమె ఓ చానల్‌తో మాట్లాడుతూ..బండ్ల గణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు. . ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు. బండ్ల గణేశ్ కూడా ‘మా’అభివృద్ది కోసం పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నానని, అంతేకాని తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment