ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష ఒకరు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం శిరీష. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం శిరీషపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు దారితీస్తోంది. బండ్ల కుటుంబానికి చెందిన శిరీష్ అంతరిక్షంలోకి వెళ్తునందుకు గర్వంగా ఉందని అంటున్నాడు గణేశ్. ‘మా బండ్ల ఫ్యామిలీ మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందని’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల శిరీష్ గణేశ్‌కి సోదరి అవుతుందా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి బండ్ల శిరీష నిజంగానే గణేశ్‌కి బంధువు అవుతుందా? లేదా ఇంటిపేరు ఒకే రకంగా ఉన్నందుకు అలా ట్వీట్ చేశారా అనేది సస్పెన్స్‌గా మారింది. దీనిపై బండ్ల గణేశే క్లారిటీ ఇవ్వాలి.
Sirisha Bandla daughter of Dr. Muralidhar Bandla and Anuradha Bandla is going into space on July11th, 9 am.
— BANDLA GANESH. (@ganeshbandla) July 2, 2021
We are all proud of you, Sirisha!
@SirishaBandla
“Astronaut 004”
Congratulations! We are all really proud of you !💐💐💐 pic.twitter.com/L615JQD3lV
Comments
Please login to add a commentAdd a comment