Indo-American
-
నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం నిజంగా చల్లటి కబురు. టెక్సాస్‌లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్‌ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు. అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు. టెక్సాస్‌లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్వుడ్ డ్రైవ్‌లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. CRITICAL MISSING-Frisco PD is seeking assistance in locating 17-year-old Ishika Thakore, last seen Monday, Apr 8 at 11:30p in the 11900-block of Brownwood Dr. in Frisco. She is approx 5’4” and 175 lbs, last seen wearing a black, long-sleeve t-shirt and red/green pajama pants. pic.twitter.com/L7fDV7HuEH — Frisco Police (@FriscoPD) April 9, 2024 కాగా గత కొన్ని నెలల్లో అమెరికాలో 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా గత నెల నుంచి తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. -
కష్టాన్నే నమ్ముకుంది! అదే ఆమెను ఎఫ్‌బీఐకి తిరుగులేని ఏజెంట్‌గా..
‘ఎఫ్‌బీఐలో పనిచేయడం అదృష్టం’ అంటాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్. ‘ఎఫ్‌బీఐ’లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఇండో–అమెరికన్ సోహిని సిన్హా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుంది. ఎఫ్‌బీఐలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో స్థాయిలలో పనిచేసింది. తాజాగా సోహిని సిన్హాను ఎఫ్‌బీఐ సాల్ట్‌లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జిగా నియమించింది... ఎఫ్‌బీఐలో సోహిని సిన్హాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కౌంటర్–టెర్రరిజం ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు తెచ్చుకుంది. భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేయడంలో, క్రిమినల్ సైబర్ ఇన్వెస్టిగేషన్లో దిట్టగా పేరున్న సోహిని సిన్హా తన వృత్తిపరమైన అంకితభావంతో ఎన్నో ప్రమోషన్లు పొందింది. 2001లో ఎఫ్‌బీఐలో స్పెషల్ ఏజెంట్‌గా చేరిన సిన్హా 2009లో సూపర్వైజరీ స్పెషల్ ఏజెంట్‌గా నియామకం అయింది. ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని కౌంటర్–టెర్రరిజం విభాగానికి బదిలీ అయింది. 2012లో అసిస్టెంట్ లీగల్ అటాషైగా ప్రమోట్ అయింది. కౌంటర్ టెర్రరిజమ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలిస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లతో కలిసి పనిచేసింది. ఆ తరువాత ఫీల్డ్ సూపర్వైజర్ (డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్)గా ప్రమోట్ అయింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంక్లిష్టమైన కేసులను ఇన్వెస్టిగేట్ చేసింది.2020లో సైబర్ ఇన్‌ట్రూజన్ స్క్వాడ్‌లో చేరింది. తన నాయకత్వ సమర్థతతో 2021లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జి (పోర్ట్లాండ్ ఫీల్డ్ ఆఫీస్) గా ప్రమోట్ అయింది. ఏజెన్సీ ఆపరేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్‌గా నియామకం అయింది. ఇంటర్నేషనల్ ఎసైన్మెంట్స్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ నుంచి ఇరాక్ వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో సంస్కృతుల మధ్య పనిచేసింది.ఎఫ్‌బీఐలో చేరడానికి ముందు సోహిని సిన్హా థెరపిస్ట్‌గా, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన క్లినిక్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది. ఇక చదువు విషయానికి వస్తే సైకాలజీలో డిగ్రీ, మెంటల్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ చదువు తన వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఇతరులకు సహాయపడాలనే సోహిని సిన్హా తపనకు ఎఫ్‌బీఐ బలమైన వేదికలా ఉపయోగపడుతోంది. -
Nabeela Syed: ఇండో-అమెరికన్ సంచలనం
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ఎన్నో సంచలనాలకు నెలవుగా మారింది. అందులో భారత సంతతికి చెందిన పలువురు నెగ్గి.. హాట్ టాపిక్‌గా మారారు. ఇందులో రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా ఉన్నారు. అయితే వీళ్లు కాకుండా నబీలా సయ్యద్ మాత్రం చరిత్ర సృష్టించింది. ఇల్లినాయిస్ స్టేట్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన.. అత్యంత పిన్నవయస్కురాలి ఘనత సాధించింది ఆమె. 23 ఏళ్ల ఈ ఇండో-అమెరికన్.. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్ బాస్‌ను ఓడించింది. ఇల్లినాయిస్ స్టేట్‌లోని 51వ డిస్ట్రిక్ నుంచి పోటీ చేసిన ఆమె.. మొత్తం ఓట్లలో 52.3 శాతం ఓట్లకు దక్కించుకుంది. దీంతో తన ఆనందాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. నా పేరు నబీలా సయ్యద్. 23 ఏళ్ల వయసున్న ముస్లిం యువతిని. ఇండో-అమెరికన్‌ని. రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉన్న స్థానాన్ని మేం కైవసం చేసుకున్నాం. జనవరిలో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీలో చిన్నవయస్కురాలిగా అడుగుపెట్టబోతున్నాం. నన్ను గెలిపించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ జిల్లాలో ప్రతీ తలుపు తట్టాను. ఇప్పుడు గెలిచిన తర్వాత మరోసారి తట్టి.. వాళ్లకు కృతజ్ఞతలు చెబుతాను. రంగంలోకి దిగడానికి నేను సిద్ధం అని సుదీర్ఘ పోస్టులు చేశారు. View this post on Instagram A post shared by Nabeela Syed (@nabeelasyed) భారత దేశ మూలాలున్న నబీలా సయ్యద్.. బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పలు ఎన్జీవోలలో పని చేయడంతో పాటు మహిళా హక్కుల సాధన, అత్యాచార బాధితుల తరపున పోరాడుతున్నారామె. ఇదీ చదవండి: లెఫ్టినెంట్ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ -
అంతరిక్షంలోకి ‘బండ్ల’ ఫ్యామిలీ.. గణేశ్ ట్వీట్ వైరల్
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష ఒకరు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం శిరీష. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం శిరీషపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు దారితీస్తోంది. బండ్ల కుటుంబానికి చెందిన శిరీష్ అంతరిక్షంలోకి వెళ్తునందుకు గర్వంగా ఉందని అంటున్నాడు గణేశ్. ‘మా బండ్ల ఫ్యామిలీ మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందని’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల శిరీష్ గణేశ్‌కి సోదరి అవుతుందా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి బండ్ల శిరీష నిజంగానే గణేశ్‌కి బంధువు అవుతుందా? లేదా ఇంటిపేరు ఒకే రకంగా ఉన్నందుకు అలా ట్వీట్ చేశారా అనేది సస్పెన్స్‌గా మారింది. దీనిపై బండ్ల గణేశే క్లారిటీ ఇవ్వాలి. Sirisha Bandla daughter of Dr. Muralidhar Bandla and Anuradha Bandla is going into space on July11th, 9 am. We are all proud of you, Sirisha! @SirishaBandla “Astronaut 004” Congratulations! We are all really proud of you !💐💐💐 pic.twitter.com/L615JQD3lV — BANDLA GANESH. (@ganeshbandla) July 2, 2021 -
Sirisha Bandla: అంతరిక్షంలోకి తొలి తెలుగు తేజం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్ అమెరికన్ సునీతా విలయమ్స్ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష కూడా చోటు సంపాదించుకోవడం విశేషంగా నిలిచింది. రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి హాబ్‌నాబ్ చేయటం! గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలు దేరుతుందని కంపెనీ ప్రకటించింది. అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్ అమెరికాకు చెందిన ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట. మరోవైపు అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఈ నెల(జూలై) 20న అంతరిక్ష పర్యటనకు పోటీగా ఆయన కంటే ముందుగానే వర్జిన్ గెలాక్టిక్ రంగంలోకి దిగుతుండటం గమనార్హం. కాగా 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరారు శిరీష. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకుంటూ ఎదిగారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేసిన శిరీషా జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. Congratulations to the team at @VirginOrbit !! What a beautiful launch ✈️🚀 https://t.co/7AxQNpbLpB Join us July 11th for our first fully crewed rocket powered test flight, and the beginning of a new space age. The countdown begins. #Unity22 https://t.co/5UalYT7Hjb. @RichardBranson pic.twitter.com/ZL9xbCeWQX — Virgin Galactic (@virgingalactic) July 1, 2021 -
ఆడపిల్లలను దూసుకెళ్లమనే స్కేటర్ గర్ల్
స్కేటింగ్ బోర్డ్ ఈ దేశంలో ఎంత మంది పిల్లలకు అందుబాటులో ఉంటుందో తెలియదుగాని ఉత్తర భారతదేశంలో పల్లెటూరి అమ్మాయిలకు ఇదో వింతే. రాజస్థాన్‌లోని ఒక అమ్మాయి ఈ చక్రాల పలకతో ప్రేమలో పడితే ఊరు ఏమంటుంది? తల్లిదండ్రులు ఏమంటారు? ఎన్నో అడ్డంకులను దాటి ఊళ్లో ఒక స్కేటింగ్ గ్రౌండ్‌ను ఆ అమ్మాయి ఎలా ఏర్పాటు చేసుకొని ఛాంపియన్ అయ్యింది? మొదటిసారిగా స్కేటింగ్ బోర్డ్ నేపథ్యంలో ఈ సినిమా తయారయ్యింది. క్రిస్టఫర్ నోలన్ దగ్గర శిష్యరికం చేసిన మన ముంబై దర్శకురాలు మంజరి మాకిజనీ దీని దర్శకురాలు. జూన్ మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా సందేశం... పరిచయం... పల్లెటూరి అమ్మాయిలంటే తాటికాయలకు పుల్ల గుచ్చి బండిలాగా లాగేంత వరకూ తెలియనిస్తారు. సైకిల్ తొక్కడం ఒక మేరకు ఓకే. ఇక వాళ్ల ఆటలన్నీ ఇంటికే పరిమితం అనుకునే పరిస్థితే మన దేశంలో. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా ఉత్తరాదిలో పల్లెటూరి ఆడపిల్లలు తొందరగా ఎదిగితే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలనే భావజాలంలోనే పెంచబడతారు. కాని వారికీ కలలుంటాయి. వారికీ సామర్థ్యాలు ఉంటాయి. వారికీ నిరూపణా శక్తి ఉంటుంది. వారికీ విజయ కాంక్ష ఉంటుంది. వారికీ అవకాశాలు పొందే హక్కు ఉంటుంది అని చెప్పే సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలా వస్తున్న సినిమా ‘స్కేటర్ గర్ల్’. ఇండో–అమెరికన్ సినిమాగా హాలీవుడ్ ప్రేక్షకులను, భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తయారైన ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్’లో జూన్ 11 నుంచి స్ట్రీమ్ కానుంది. దీని దర్శకురాలు మంజరి మాకిజనీ. హాలీవుడ్లో మన స్త్రీ దర్శకురాలు ‘షోలే’ సినిమా చూసిన వారందరికీ అందులో మెక్ మోహన్ పోషించిన ‘సాంబ’ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఆ మెక్ మోహన్ కుమార్తే మంజరి మాకిజనీ. ‘చిన్నప్పుడు నాన్నతో పృథ్వీ థియేటర్ (ముంబై)కు వెళ్లి నాటకాలు చూసి ఆయనతో చర్చించడం నా మీద ప్రభావం చూపింది’ అంటుంది మంజరి. గత ఏడేళ్లుగా లాస్ ఏంజెలెస్ లో స్థిరపడి హాలీవుడ్ కోసం కూడా పని చేస్తున్న మంజరి బాలీవుడ్లో విశాల్ భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌కు వెళ్లి క్రిస్టఫర్ నోలన్ ‘డన్కిర్క్’కు పని చేసింది. ఆమె తీసిన షార్ట్ ఫిల్మ్ ‘ఐ సీ యూ’, ‘ది లాస్ట్ మార్బెల్’, ‘ది కార్నర్ టేబుల్’ అనే షార్ట్ ఫిల్మ్స్‌కు చాలా పేరు వచ్చింది. ఎంత పేరు వచ్చిందంటే ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ తన 2016లో నిర్వహించిన మహిళా డైరెక్టర్ల వర్క్‌షాప్‌కు ఆహ్వానం అందేంత. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 1973 నుంచి ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటే ఇప్పటివరకూ ఆహ్వానం అందుకున్న భారతీయులలో మంజరి రెండవ వ్యక్తి అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమెకు నోలన్ వంటి ప్రఖ్యాత దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. స్కేటర్ గర్ల్ ఇంత అనుభవం తర్వాత మంజరి ‘స్కేటర్ గర్ల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చే, వారి కలలకు ఊతం ఇచ్చే ఈ కథను ఆమె తన సోదరి వినతి మాకిజనీతో కలిసి రాసుకుంది. బాలీవుడ్లో ఇప్పటి వరకూ హాకీ, బాడ్మింటన్, క్రికెట్ వంటి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలు వచ్చాయి. కాని దేశంలో ఎక్కడా ‘స్కేట్‌బోర్డ్’ నేపథ్యంగా సినిమా రాలేదు. ‘స్కేటర్ గర్ల్’ మొదటిది. అందుకే ఈ సినిమా మీద అందరికీ ఆసక్తి నెలకొంది. అడ్డంకులు దాటాలా? రాజీ పడాలా? బ్రిటన్‌కు చెందిన ఒక యాడ్ ప్రొఫెషనల్ జెస్సికా (బ్రిటిష్ నటి అమి మఘేరా) రాజస్థాన్‌లోని మారుమూల పల్లెకు షూటింగ్ నిమిత్తం రావడంతో ఈ కథ మొదలవుతుంది. అక్కడ పిల్లలు చక్రాలు బిగించుకున్న కర్రబల్లను లాక్కుంటూ ఆడుకుంటున్నారు. ఈ బల్ల స్కేట్‌బోర్డ్‌కు దగ్గరగా ఉంది అని జెస్సికా గమనిస్తుంది. అంతేకాదు, ఆ ఊరి అమ్మాయి ప్రేరణ ఆ బల్లను బేలెన్స్ చేయడంలో ఎంతో ప్రావీణ్యం చూపించడం కూడా గమనిస్తుంది. అంతే. ఆ పిల్లలందరికీ స్కేట్‌బోర్డ్ కొనిచ్చి వారిని అందులో ఎంకరేజ్ చేస్తుంది. కాని అసలే పల్లెటూరు. ఆపైన ఆడపిల్ల. ప్రేరణకు స్కూల్లో, ఇంట్లో, ఊళ్లో ఎన్నో అడ్డంకులు. ఆడపిల్ల ఇలాంటి ఆట ఆడటం ఏమిటి? అని. అయితే ఆ ఆడపిల్ల ఆ ఆట ఆడటమే కాదు ఊళ్లో పిల్లలందరూ ఆడుకోవడానికి కమ్యూనిటీ స్కేటింగ్ పార్క్ నిర్మించడానికి కంకణం కట్టుకుంటుంది. అంతే కాదు, ప్రాక్టీసు చేసి ఛాంపియన్షిప్ సాధించాలని పట్టుబడుతుంది. ‘స్కేటర్ గర్ల్’ దర్శకురాలు మంజరి మాకిజనీ. ‘నీ భయాన్ని జయించాలనంటే దానిని ఎదుర్కొనడమే మార్గం’ అంటుంది ప్రేరణ. ఆడపిల్లలుగాని, యువతులుగాని, స్త్రీలు గాని తమ గమనంలో ఫలానా అడ్డంకి వస్తుందని భయపడి ఆగిపోవడం కంటే దానిని గెలవడానికి దానిని ఎదుర్కొనడమే మంచిది అని ఈ సినిమా చెబుతుంది. మంచి సాంకేతిక నిపుణులు, నటీనటులు పాల్గొన్న ఈ సినిమాలో సీనియర్ నటి వహీదా రహమాన్ ఒక ముఖ్యపాత్ర పోషించడం విశేషం. ఇంకో పది రోజుల్లో చూడటానికి సిద్ధంగా ఉండండి. – సాక్షి ఫ్యామిలీ -
నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్ నీరాటాండన్ నియామకాన్ని రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్‌లో కీలక సభ్యులు బహిరంగంగానే ఆమె నియామకంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. గతంలో పలువురు సెనేటర్లకు వ్యతిరేకంగా ఆమె అనేక అవమానాస్పద వ్యాఖ్యలు చేసిందంటున్నారు. టాండన్ నియామకానికి సెనేట్ ఆమోద ముద్ర తప్పనిసరి. ఈనేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నీరా నియామకం బైడెన్ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో అత్యంత చెత్త నిర్ణయమని కీలకమైన సెనేటర్ జాన్ కార్నిన్ మండి పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే, ఆమెతో కలిసి పనిచేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. పాత వ్యాఖ్యలు బయటపడకుండా ఉండేందుకు ఆమె ఇటీవల తన పాత ట్వీట్లను చాలావరకు డిలీట్ చేసిందన్నారు. రిపబ్లికన్లను విమర్శిస్తూ చేసిన దాదాపు 1000 ట్వీట్లను ఆమె తొలగించిందన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 50 సీట్లున్నాయి. డెమొక్రాట్లకు 48 సీట్లున్నాయి. కీలకమైన రెండు సీట్లకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. నీరా పాత ట్వీట్లను పరిశీలిస్తే ట్రంప్‌పై, సెనేట్ మెజార్టీ లీడర్ మెక్కనెల్పై పలు విమర్శలున్నాయి. మెక్కనెల్ను ఆమె మాస్కో మిచ్ అని సంబోధించారు. అప్పుడప్పుడు డెమొక్రాట్లకు మద్దతు పలికే రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్‌ను పాథటిక్గా ఆమె వర్ణించారు. దీనికితోడు గతంలో ఆమె నిర్వహించిన పదవుల్లో వివక్షతో వ్యవహరించారని కొందరు సెనేటర్లు విమర్శించారు. అయితే టాప్ డెమొక్రాట్ సెనేటర్లలో కొందరు మాత్రం ఆమె నియామకాన్ని సమర్థించారు. ట్రంప్ కామెంట్లతో పోలిస్తే ఆమె కామెంట్లు చాలా సరళంగా ఉన్నాయన్నారు. బైడెన్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
భారతీయురాలికి బంగారు కత్తెర
వాషింగ్టన్: అమెరికాలో కాలంచెల్లిన నియంత్రణల రద్దులో కీలక పాత్ర పోషించిన ఇండో–అమెరికన్ నయోమి జహంగీర్ రావ్‌కు తగిన గుర్తింపు లభించింది. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు బంగారు కత్తెరను బహూకరించారు. 1960ల నాటి, ప్రస్తుత నియంత్రణలను కలిగిన ప్రతులను చుట్టిన రెడ్ టేప్(కఠిన నియంత్రణలకు సూచిక)ను ట్రంప్ ఈ కత్తెరతోనే కత్తిరించి రావ్‌కు అందించారు. 2017 జూలై 18 నుంచి శ్వేతసౌధ సమాచార, నియంత్రణ వ్యవహారాల హెడ్‌గా వ్యవహరిస్తున్న రావ్ పాత నిబంధనలు, నియంత్రణల తొలగింపుకు కృషిచేశారు. ట్రంప్ ప్రతి కొత్త నియంత్రణకు 22 పాత వాటిని ఎత్తివేశారు. సంస్కరణలతో సుమారు రూ.51925 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. -
భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డు
అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్ ప్రాంతంలోని ఫ్లింట్ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులన్నాయి. ప్రత్యేకమైన పట్టీలతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం సంగతి వెంటనే తెలిసిపోతుంది గానీ.. కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు. ఇక రెండోది ప్రభుత్వ సంస్థలకు నీటి నమూనాలను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తలతో కలసి తన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. కార్బన్ నానో ట్యూబులతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతోపాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. ప్రస్తుతం గీతాంజలి తన పరికరానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. -
ఇద్దరు ఇండో అమెరికన్లకు ‘జూనియర్ నోబెల్ ప్రైజ్’
వాషింగ్టన్: శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే భారీ నజరానాగా ఇచ్చే సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ద పబ్లిక్(ఎస్ఎస్పీ) పురస్కారం ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్లకు దక్కింది. మెదడుకు అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాధులను నయం చేసే పరిశోధనకుగాను ఇంద్రాణి దాస్ మొదటిస్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకోగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పరిశోధనకుగాను అర్జున్ రమణీ మూడోస్థానంలో నిలిచి లక్షన్నర డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. జూనియర్ నోబెల్ ప్రైజ్‌గా పిలిచే ఈ అవార్డు ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్లకు దక్కడంపై అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకుగాను 1942లో వెస్టింగ్‌హౌస్ ఈ పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత 1998 నుంచి ఈ పురస్కారం కింద ఇచ్చే నగదును ఇంటెల్ సంస్థ అందజేస్తోంది. ఇక ఈ బహుమతి గెలుచుకున్న 40 మంది ఫైనలిస్టుల్లో ఎనిమిది మంది భారతీయ మూలాలున్న యువతీయువకులే కావడం విశేషం. బహుమతి ప్రదానోత్సవంలో ఎస్ఎస్పీ ప్రెసిడెంట్ మాయా అజ్మీరా మాట్లాడుతూ... పురస్కారాన్ని అందుకున్న ప్రతిఒక్కరూ భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆక్షాంక్షిస్తున్నట్లు చెప్పారు. -
ట్రంప్ టీమ్‌లో ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికాలో మనవాళ్లు ఉన్నత పదవులు చేపట్టడడం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఇండో అమెరికన్ సీమా వర్మకు ఉన్నత పదవి దక్కింది. సీమా వర్మకు టాప్ హెల్త్ కేర్ పోస్ట్ ఇవ్వడాన్ని సెనేట్ 55–43 ఓట్లతో ఆమోదించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఉన్న ఒబామాకేర్ పథకాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త పథకం తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆరోగ్య శాఖలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారని వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్ యంత్రాం గంలో ఉన్నత స్థానాలకు సెనేట్ ఆమోదించిన రెండో ఇండో అమెరికన్ సీమా వర్మ. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తొలి ఇండో అమెరికన్ కేబినెట్ ర్యాంక్ ఆఫీసర్. 130 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించే మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీస్ సెంటర్లకు బాధ్యత వహించనున్నారు. సీమా ఇండియానా సహా పలు రాష్ట్రాల్లో ఆరోగ్య విభాగానికి చెందిన సంస్కరణలు చేపట్టారు. -
ఇండో అమెరికన్‌కు ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ అవార్డు
హూస్టన్: రసాయనశాస్త్ర రంగంలో ప్రత్యేక సేవలందించిన భారత సంతతి వ్యక్తి పుర్ణేందు దాస్‌గుప్తాకు ప్రతిష్టాత్మక కెమిస్ట్రీ అవార్డు లభించింది. అనలిటికల్ కెమిస్ట్రీ విభాగంలో అమెరికన్ కెమికల్ సొసైటీ అందించే జె.కెల్విన్ గిడ్డింగ్స్ అవార్డు 2015 సంవత్సరానికిగాను ఆయన గెలుచుకున్నారు. టెక్సాస్ వర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గుప్తా నీటిలో విషపూరిత ఆర్సెనిక్ పరిమాణాన్ని కనుక్కోవడానికి పర్యావరణహిత అనలైజర్‌ను తయారుచేశారు.