ట్రంప్ టీమ్‌లో ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికాలో మనవాళ్లు ఉన్నత పదవులు చేపట్టడడం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఇండో అమెరికన్ సీమా వర్మకు ఉన్నత పదవి దక్కింది. సీమా వర్మకు టాప్ హెల్త్ కేర్ పోస్ట్ ఇవ్వడాన్ని సెనేట్ 55–43 ఓట్లతో ఆమోదించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఉన్న ఒబామాకేర్ పథకాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త పథకం తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆరోగ్య శాఖలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారని వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్ యంత్రాం గంలో ఉన్నత స్థానాలకు సెనేట్ ఆమోదించిన రెండో ఇండో అమెరికన్ సీమా వర్మ. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తొలి ఇండో అమెరికన్ కేబినెట్ ర్యాంక్ ఆఫీసర్. 130 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించే మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీస్ సెంటర్లకు బాధ్యత వహించనున్నారు. సీమా ఇండియానా సహా పలు రాష్ట్రాల్లో ఆరోగ్య విభాగానికి చెందిన సంస్కరణలు చేపట్టారు.