Seema Verma
-
సీమా వర్మ ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్: అమెరికాలో కీలకమైన హెల్త్ కేర్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతికి చెందిన సీమా వర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ట్రంప్ యంత్రాంగంలో అడుగిడిన రెండో ఇండో– అమెరికన్‌గా వర్మ గుర్తింపు పొందారు. 55– 43 ఓట్ల తేడాతో సెనేట్ ఆమెను ఎన్నుకున్నట్లు శ్వేత సౌధ వర్గాలు వెల్లడించాయి. దీంతో 130 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించే ‘మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీస్ సెంటర్ల’కు అధిపతిగా వర్మ బాధ్యతలు నిర్వహించనున్నారు. యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంక్షేమాన్ని అందించే దిశగా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. గత రెండు దశాబ్దాలుగా ఇండియానా సహా పలు రాష్ట్రాలోని ప్రైవేట్ ఆరోగ్య రంగ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. -
ట్రంప్ టీమ్‌లో ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికాలో మనవాళ్లు ఉన్నత పదవులు చేపట్టడడం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఇండో అమెరికన్ సీమా వర్మకు ఉన్నత పదవి దక్కింది. సీమా వర్మకు టాప్ హెల్త్ కేర్ పోస్ట్ ఇవ్వడాన్ని సెనేట్ 55–43 ఓట్లతో ఆమోదించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఉన్న ఒబామాకేర్ పథకాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త పథకం తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆరోగ్య శాఖలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారని వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్ యంత్రాం గంలో ఉన్నత స్థానాలకు సెనేట్ ఆమోదించిన రెండో ఇండో అమెరికన్ సీమా వర్మ. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తొలి ఇండో అమెరికన్ కేబినెట్ ర్యాంక్ ఆఫీసర్. 130 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించే మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీస్ సెంటర్లకు బాధ్యత వహించనున్నారు. సీమా ఇండియానా సహా పలు రాష్ట్రాల్లో ఆరోగ్య విభాగానికి చెందిన సంస్కరణలు చేపట్టారు. -
మరో ఇండియన్‌కు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్ అమెరికన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ ప్రీత్ బరారాను తన హయాంలోనూ కొనసాగించేందుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారా మూడో భారత సంతతి అమెరికన్‌ను ఆయన తన అధికార యంత్రాంగంలోకి తీసుకున్నట్టయింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రీత్ బరారాను అమెరికా అటార్నీగా నియమించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, సెక్యూరిటీస్ స్కాంలు వంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించి పేరుప్రఖ్యాతాలు సాధించిన బరారా బుధవారం ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ తనను పదవిలో కొనసాగమని కోరారని, అందుకు తాను సమ్మతి తెలిపానని బరారా విలేకరులకు తెలిపారు. ట్రంప్ న్యూయార్క్ వాసి, గత ఏడేళ్లుగా తమ కార్యాలయం అందిస్తున్న సేవలు ఆయనకు తెలుసునని, అమెరికా అటార్నీగా గత ఏడేళ్లలో నిర్భయంగా, స్వతంత్రంగా, ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా తాము సేవలు అందించామని తెలిపారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ అధికార యంత్రాంగంలో చేరిన మూడో ఇండియన్ అమెరికన్ బరారా. ఇప్పటికే సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ, మెడికేర్ సర్వీసెస్‌కు చెందిన సీమా వర్మ ట్రంప్ యంత్రాంగంలోనూ కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ టీంలో మరో భారతీయ అమెరికన్
వాషింగ్టన్: భారతీయ-అమెరికన్ వైద్యురాలు సీమా వర్మకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యంత్రాంగంలో ఉన్నత పదవి దక్కింది. అమెరికా ఆరోగ్య విభాగంలోని ‘సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికై డ్ సర్వీసెస్’కు ఇన్చార్జ్గా ట్రంప్ ఆమెను నామినేట్ చేశారు. దీనిపై సీమ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు భారతీయ-అమెరికన్ మహిళ నిక్కీ హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ట్రంప్ నామినేట్ చేయడం తెలిసిందే. సీమ ఎస్వీసీ అనే జాతీయ ఆరోగ్య విధానం సలహా సంస్థను స్థాపించారు. ప్రస్తుతం దానికి సీఈవోగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌లో సభ్యుడైన టామ్ ప్రైస్‌ను ట్రంప్ ఆరోగ్య, మానవ సేవల మంత్రిగా నామినేట్ చేశారు. ఒబామా హెల్త్ కేర్ చట్టాన్ని ప్రైస్ విమర్శించేవారు. మరోవైపు అమెరికా సీఐఏ మాజీ చీఫ్ డేవిడ్ పెట్రాస్, ట్రంప్‌ను కలిశారు. ఈయన పేరు విదేశాంగ మంత్రి పదవికి పరిశీలనలో ఉంది. మరోవైపు క్యూబాతో ఒబామా స్థాపించిన సన్నిహిత సంబంధాలను రద్దు చేస్తానని ట్రంప్ అనడంపై శ్వేతసౌధం స్పందించింది. దీనివల్ల అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంది.