
బండ్ల గణేష్.. ప్రస్తుతం ఈ పేరు సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. స్టేజ్ ఎక్కితే చాలు ఆపకుండా తన వాక్ చాతుర్యం ప్రదర్శించే గణేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. ట్విటర్‌లో క్లారిటి లేని పోస్టులు పెట్టి తప్పులో కాలేస్తుంటాడు. అలా నెటిజన్లకు దొరికిపోవడంతో ఈ పోస్టులను డిలీట్ చేస్తుంటాడు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ తప్పులో కాలేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఆయన ప్రకటించాడు. తాను ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇస్తున్నానని ఇన్‌స్టా ఐడీ ఇదేనంటూ ట్వీట్ చేశాడు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇన్‌స్టా ప్రొఫైల్‌కు సంబంధించిన లింక్ మాత్రం షేర్ చేయడం మరిచిపోయాడు. అది గమనించి ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి మళ్లీ పోస్టు చేశాడు. రెండోసారి కూడా లింక్ షేర్ చేయడం మరచిపోయి మళ్లీ ఆ ట్వీట్ చేశాడు. ఇక మూడోసారి కూడా అదే తప్పు చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు బండ్ల గణేశ్‌ను తమదైన శైలిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా? ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఏది.. ఎందుకు ట్వీట్స్ డిలీట్ చేస్తున్నావ్.. మళ్లీ ఎందుకు ట్వీట్లు పెడుతున్నావ్’ అంటూ కామెంట్లు పెడుతు కౌంటర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment