
Bandla Ganesh Interesting Reaction On Chiranjeevi Comments: తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్వవహరించాలనుకోవడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ తెలుగు సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా 'నేను ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండాలనుకోవట్లేదు. ఆ హోదా నాకు అస్సలు వద్దు. ఇద్దరు గొడవపడుతుంటే పరిష్కరించడానికి నేను ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా' అని తెలిపారు చిరంజీవి.
ఈ వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికరంగా స్పందించారు. చిరు వ్యాఖ్యలను బండ్ల గణేష్ సమర్థించారు. 'సూపర్ సర్' అంటూ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆయన మాటలను రిపీట్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే 'మా' ఎన్నికల తర్వాత సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధం గా వుంటాను
— BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022
ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యను @KChiruTweets Sir 👌
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
— BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022
ఇండస్ట్రీ పెద్దరికం పదవి లో నేను వుండను
ఆ స్థానం నాకు వద్దు
అవసరం వస్తె తప్పకుండా అక్కడ వుంటాను
ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు @KChiruTweets sir
ఇదీ చదవండి: సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండే ప్రసక్తే లేదు.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు