విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటించిన చిత్రం లైగర్. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రౌడీ హీరో భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు. అటు సోషల్ మీడియానూ లైగర్ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ఊపు ఊపారు. అభిమానుల హడావుడి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్ మెంటల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు.
'మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయన..' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విజయ్ టాలీవుడ్‌లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేశ్ దీనికి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్' అని ట్వీట్ చేశాడు. అయితే కొందరు ఇది రౌడీ హీరోకు కౌంటర్ ఇచ్చినట్లు ఉందని అంటుంటే మరికొందరు మాత్రం ప్రభాస్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌లను విమర్శించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022
చదవండి: తెలుగు సినిమాలకు అవార్డుల పంట
ఆడపిల్లకు జన్మనిచ్చిన నటి
Comments
Please login to add a commentAdd a comment