
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే భగవంతునికి ధన్యవాదాలు తెలిపారు. అపోలో డయోగ్నోస్టిక్స్‌లో కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా షేర్ చేశారు. అందులో ఆయనకు కరోనా తగ్గినట్టుగా తేలింది. కాగా, ఇటీవల బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను కలిసిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. అయితే గణేష్ మాత్రం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అభిమానులకు చెబుతూ వచ్చారు. (చదవండి : నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!)
Thanks god 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/XLNv57nVEr
— BANDLA GANESH. (@ganeshbandla) June 30, 2020