
ఆ ట్వీట్లు ఎవరిని ఉద్దేశించినవి అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మహేశ్ తన స్టైలీష్ లుక్‌తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పిల్లలకు అతను అన్నయ్యాల ఉన్నడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం ఎవరి శైలిలో వారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ కూడా తనదైన స్టైల్లో మహేష్ తాజా లుక్‌పై స్పందించాడు.
‘మహేష్ సర్ మీరు హాలీవుడ్ సూపర్ స్టార్ లా ఉన్నారు’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చివరగా బండ్ల గణేష్ మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో తన రియల్ లైఫ్ కాంట్రవర్సీలపై కూడా గణేష్ సెటైర్స్ వేసుకోవడం జనాలను ఆకట్టుకుంది. ‘చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది’, ‘జాగ్రత్త మిత్రమా, వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు’ అంటూ మరో రెండు ట్వీట్లు చేయడంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్లు చేశారో అని నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైనది.
@urstrulyMahesh sir your looking @urstrulyMahesh from Hollywood superstar 💫💫💫 pic.twitter.com/MBFB78XCMA
— BANDLA GANESH (@ganeshbandla) May 17, 2020
చదవండి:
సమంత కోసం ‘మైత్రీ’ భారీ ప్లానింగ్!
ప్రియా షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్