మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్న నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
చదవండి: MAA Elections 2021 : మసకబారుతున్న 'మా' ప్రతిష్ట..
ఇందులో భాగంగా తమ ప్యానల్ సభ్యులతో ప్రకాశ్ రాజ్ శనివారం సమావేశయ్యారు. ఇక ఆదివారం ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపారు. దీంతో బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీటర్‌లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై బండ్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి ‘మా’ కళాకారులనువిందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు.. చాటా మంది చావు దాకా వెళ్లొచ్చారు.
చదవండి: సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల
అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పేర్కొన్నాడు. ఇక ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీకి దిగడంతో బండ్ల రంగంలోకి దిగి.. జీవితపై తను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ బయటకు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ సారి మా ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు విష్ణు ఇప్పటికీ తన ప్యానల్ సభ్యులను ప్రకటించకలేదు.
It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g
— BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021
Comments
Please login to add a commentAdd a comment