
వకీల్ సాబ్ చిత్రంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం పుల్ జోరు మీద ఉన్నాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినీ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే చిత్రంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్ ఆగిపోయింది.
ఈ రెండు చిత్రాల తర్వాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఆ తరువాత బండ్ల గణేశ్‌తో ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని బండ్ల కూడా కన్‌ఫాం చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఖిలాడి చిత్ర డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడని ఆ వార్త సారాంశం. దీనిపై బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సినిమా ఫైనల్ అయ్యాక తనే అఫీషియల్‌గా ప్రకటిస్తాని స్పష్టం చేశాడు.
చదవండి:
రేపు అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్ సర్‌ప్రైజ్
నా కల నిజమైంది: ప్రియదర్శి