Bandla Ganeshs Degala Babji Trailer Out: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటించిన సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్‌ను పరిచయం చేశారు.
సినిమాలో బండ్ల గణేష్ పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉండటం గమనార్హం.'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను' అంటూ బండ్ల చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment