Puri Jagannadh Strong Counter To Bandla Ganesh, Audio Goes Viral - Sakshi
Sakshi News home page

Puri Jagannadh: నాలుక కట్‌ చేసుకో.. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్‌ వార్నింగ్‌?!

Published Sun, Jun 26 2022 5:53 PM | Last Updated on Sun, Jun 26 2022 7:08 PM

Puri Jagannadh Strong Counter To Bandla Ganesh, Audio Goes Viral - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు, హీరో ఆకాశ్‌ పూరీ నటించిన తాజా చిత్రం చోర్‌ బజార్‌. జూన్‌ 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పర్వాలేదనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు పూరీ జగన్నాథ్‌ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే! దీంతో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ వేదికపైనే పూరీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దేశం మొత్తం కల్లాపు చల్లాడు. కానీ, ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదు, కన్న కొడుకు ఫంక్షన్‌కు వచ్చేంత టైం లేదా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాజాగా దీనిపై పూరీ జగన్నాథ్‌ పరోక్షంగా స్పందించాడు. 'గుర్తుపెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్‌లో ఎక్కువ టైం లిసనర్స్‌(వింటూ ఉంటే)గా ఉంటే చాలు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌, క్లోజ్‌ ఫ్రెండ్స్‌, ఆఫీస్‌ జనాలు, ఆఖరికి కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, మన క్రెడిబులిటీని డిసైడ్‌ చేస్తుంది. సుమతీ శతకం మీకు గుర్తుండే ఉంటుంది. నొప్పింపక తానొవ్వక.. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్‌గా ఓ మాట.. నీ బతుకు, నీ చావు నాలుక మీదే ఆధారపడి ఉంటుంది' అంటూ యూట్యూబ్‌లో ఓ ఆడియో వదిలాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. బండ్లన్నకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మావాడికి నేను ఎక్స్‌పోజింగ్‌ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా..
ఇంట్లో వ్రతం.. భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన కార్తీకదీపం నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement