
Bandla Ganesh Adopted Nepali Girl: కమెడియన్, నిర్మాతగా సత్తా చాటిన బండ్ల గణేష్..ఇటీవలె హీరోగానూ మారాడు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే బండ్లగణేష్‌కు ప్రత్యేకమైన అభిమానులు సైతం ఉన్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తనవంతు సాయం అందించిన మంచి మనసు చాటుకున్నాడు బండ్ల గణేష్. తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాట తమ ఇంట్లో మెంబర్ అయిపోయిందని, ఇప్పుడు తామందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని ఫన్నీగా పేర్కొన్నాడు.
@ganeshbandla అన్న నిన్ను నిందించి అగౌరవ పారిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికి సరిపోదు అన్న.....🙏💯 pic.twitter.com/w0FDBDDH68
— Rock ⭐ Rockey🔥👑 (@RavitejanaiduS2) November 27, 2021
Comments
Please login to add a commentAdd a comment