
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, బండ్ల గణేశ్ శనివారం ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తూంకుంట నర్సారెడ్డి, రాములు నాయక్ శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఒంటేరు ఢిల్లీ వచ్చారు. ఏపీ భవన్‌లో బస చేసిన చంద్రబాబును ఒంటేరు గణేశ్‌తో వచ్చి కలిశారు. తెలంగాణలో ఏపీ పోలీసులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ప్రచారం ఊపందుకోవడం, పలుచోట్ల ఆ తరహా ఘటనలు బహిర్గతమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఒంటేరుకు కాంగ్రెస్ టికెట్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతుండటంతో ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించేందుకు బాబు ఆశీస్సులు తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబుతో సమావే శం అనంతరం బయటకొచ్చిన ఒంటేరు, బండ్ల ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ ఎంపీలతో కాసేపు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment