
నిర్మాత,నటుడు బండ్ల గణేష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్ మాట్లాడే స్పీచుకలే సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక ఆయన చేసే ట్వీట్స్ కూడా ఆటం బాంబ్స్‌లా పేలుతుంటాయి. తాజాగా బండ్లగణేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవలె రాజకీయాలకు గుడ్‌డై చెప్పిన బండ్ల.. తాజాగా పాలిటిక్స్ వల్ల జీవితంలో చాలా నష్టపోయానని తెలిపారు. తనకు రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అందరూ ఆత్మీయులే అంటూ ట్వీట్ చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్.. కొంతకాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment