
కమెడియన్ నుంచి బడా ప్రొడ్యుసర్ దాకా ఎదిగారు బండ్ల గణేష్. స్టార్ ప్రొడ్యుసర్‌గా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించిన గణేష్.. ఈ మధ్య సినిమాలను తగ్గించినట్టు కనిపిస్తోంది. బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధం తెలిసిందే. రాంచరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను కూడా ఆయన నిర్మించారు.
నిన్న (ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గణేష్ చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన బండ్ల గణేష్ సోదరుడి కుమార్తె పెళ్లికి చిరంజీవి హాజరయ్యారు. చిరు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి ఎస్ ఎస్ రాజమౌళి, కృష్ణంరాజు, గోపిచంద్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.



Comments
Please login to add a commentAdd a comment