
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందుకు కారణం యూత్‌లో బండ్లన్న ఉన్న క్రేజీయే.
తాజాగా బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో మరెవరిదో కాదు.. మన బండ్లన్న పెద్ద కుమారుడు హితేష్ నాగన్ బండ్లది. అచ్చ అచ్చుగుద్దినట్లు బండ్ల గణేశ్‌లా ఉన్న ఈ ఫోటోని ఆయన షేర్ చేస్తూ.. ‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ నెటిజన్స్‌కి పరిచయం చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది. బండ్ల గణేశ్ కుర్రాడిగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలాగే ఇది ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.‘అచ్చు మీ జిరాక్స్‌లా ఉన్నాడు. డిట్టో దిగిపోయాడు. హీరోని చేస్తారా..?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా’ అనే ప్రశ్నకి ‘అంతా దేవుడి దయ’ అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేశ్.
My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F
— BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021
Comments
Please login to add a commentAdd a comment