అద్భుతమైన వార్త, బాస్ ఓకే : బండ్ల గణేష్ | Bandla Ganesh Announces Next Project With Pawan Kalyan | Sakshi
Sakshi News home page

అద్భుతమైన వార్త, బాస్ ఓకే : బండ్ల గణేష్

Published Mon, Sep 28 2020 1:08 PM | Last Updated on Mon, Sep 28 2020 1:55 PM

Bandla Ganesh Announces Next Project With Pawan Kalyan - Sakshi

సాక్షి,  హైదరాబాద్ : నిర్మాత బండ్ల గణేష్‌కు మరోసారి  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చెప్పేసినట్టు కనిపిస్తోంది.  దీంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన కల నెర వేరబోతోందంటూ కొత్త ప్రాజెక్టును పవన్ వీరాభిమాని ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయం బండ్ల గణేష్  ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాస్ ఓకే చెప్పారు. మరోసారి కల నెరవేరుతోంది. ఇందుకు దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.   (నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ)

‘‘నా భవిష్యత్తును ఈరోజు 11.23 గంటలకు ప్రకటిస్తాను. నా శ్రేయోభిలాషులకు ఇదొక అద్భుతమైన వార్త’’ అని  ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో తీసుకున్న ఒక ఫొటోను  కూడా పోస్ట్  చేయడం విశేషం. దీంతో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ లాంటి మరో బ్లాక్ బస్టర్ సిద్ధం కానుందంటూ పండుగ చేసుకుంటున్న అభిమానులు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనిపై అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది. విరామం తరువాత ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్లీ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ పింక్ సినిమా రీమేక్ ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు బోనీ కపూర్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement