Mandela Movie Telugu Remake: Bandla Ganesh Will Play Lead Role - Sakshi
Sakshi News home page

Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్‌, హీరోగా బండ్ల గణేశ్‌

Published Tue, Apr 27 2021 3:42 PM | Last Updated on Tue, Apr 27 2021 6:54 PM

Bandla Ganesh Play As Hero In Mandela Movie Telugu Remake - Sakshi

ఒకప్పుడు కమెడియన్‌గా తెలుగు వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్‌ తర్వాత పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాతగా సక్సెస్‌ అయ్యాడు. ఇక అప్పటి నుంచి సినిమాల్లో నటించడం తగ్గించిన బండ్ల నిర్మాతగా సెటిలైపోయాడు. అయితే వెండితెరపై మాయమైన బండ్ల అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్నాడు. గత ఏపీ ఎన్నికల సమయంలో బ్లేడ్‌ వ్యవహరంతో ఆయన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పూర్తిగా సినిమాలు తగ్గించిన ఆయన ఇటీవల మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమాతో మరోసారి కెమెరా ముందుకు వచ్చాడు.

ఇదే జోష్‌లో ఉన్న బండ్ల గణేశ్‌ తాజాగా తెరపై హీరోగా అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ తమిళ మూవీని తెలుగులో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అంతేకాదు ఇందులో ఏకంగా లీడ్‌ రోల్‌ పోషించేందుకు బండ్ల సన్నాహాలు చేస్తున్నాడట. తమిళంలో వచ్చిన ‘మండెల’ మూవీ విడుదలైన తర్వాత పలు వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఎంతటి స్థాయిలో నెగిటివ్‌ టాక్‌ వచ్చిందో అంతే రేంజ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచింది.  అయితే ఇప్పుడు ఈ మూవీని బండ్ల తెలుగులో రీమేక్‌ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎలాగైన ఈ మూవీని తెలుగు తెరపైకి ఎక్కించేందుకు తెలుగు హక్కుల కోసం ఆయన కాస్తా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక తమిళంలో వచ్చిన ఈ ‘మండెల’ మూవీలో హీరోగా తమిళ నటుడు యోగిబాబు నటించాడు. అయితే ఈ పాత్రకు తెలుగులో బండ్ల గణేశ్‌ అయితే కరెక్ట్‌ సరిపోతారని ఓ దర్శకుడు ఇచ్చిన సలహా విని తానే హీరోగా నటించాలని బండ్ల ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. బండ్ల గణేశ్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ఆయన హీరోగా నటిస్తారా లేక వేరే నటుడిని తీసుకుంటారో తెలియాలంటే కోద్దిరోజుల ఆగాల్సిందే. అయితే దీనిపై ఇంతవరకు బండ్ల గణేశ్‌ స్పందించకపోవడం గమనార్హం. 

చదవండి: 
Bandla Ganesh: మళ్లీ తప్పులో కాలేసిన బండ్ల గణేష్‌, నెటిజన్ల కౌంటర్‌‌
అడ్డంగా దొరికిన బండ్ల గణేష్‌: నెట్టింట్లో నవ్వులపాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement