Bandla Ganesh Tested Corona Positive: టాలీవుడ్‌లో కరోనా కలకం రేపుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు(ఆదివారం) స్వల్ప లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
కాగా ఇప్పటికే గతంలో రెండుసార్లు బండ్ల గణేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా బారిన పడిన ఆయన ఆ సమయంలో ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా మూడోసారి కోవిడ్ బారిన పడ్డారు.
Last three days I was at delhi and I tested positive today evening .
— BANDLA GANESH. (@ganeshbandla) January 9, 2022
I have mild symptoms, and my family is tested negative . Please be careful and think before you travel I’m in isolation .
Thank you #Besafe pic.twitter.com/9i4CIRI5XC
Comments
Please login to add a commentAdd a comment