
బండ్ల గణేష్ నవరసాలతో మీ డేగల బాబ్జీ అంటూ రిలీజ్ డేట్‌తో కూడిన ఓ పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇందులో బండ్ల నిజంగానే నవరసాలు ఒలికిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం డేగల బాబ్జీ. వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా నుంచి రంజాన్ సందర్భంగా ఓ అప్‌డేట్ వచ్చింది. మే 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు బండ్ల గణేష్.. 'నవరసాలతో మీ డేగల బాబ్జీ' అంటూ రిలీజ్ డేట్‌తో కూడిన ఓ పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇందులో బండ్ల నిజంగానే నవరసాలు ఒలికిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రంలో గణేష్ పలు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు.
EAD MUBARAK 👏 pic.twitter.com/qjn2ZcSvmh
— BANDLA GANESH. (@ganeshbandla) May 3, 2022
చదవండి: రాకింగ్ రాకేశ్‌కు కాస్ట్‌లీ ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత