‘‘అసోసియేషన్ ఎలక్షన్స్ అంటేనే పలు అంశాల గురించి సభ్యులతో మాట్లాడటం, ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్స్‌లో ఓ భాగం. మాట్లాడుకోవడం తప్పు కాదు. అందులో భాగంగానే ఆదివారం కొంతమంది సభ్యులను లంచ్‌కు ఆహ్వానించాం’’ అన్నారు నటుడు ప్రకాశ్‌రాజ్. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎలక్షన్స్ అక్టోబరు 10న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్ తరఫున ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు ప్రకాశ్‌రాజ్. ఈ నేపథ్యంలో ఆదివారం ‘మా’ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేసి, సమావేశం నిర్వహించారు.
చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ విందు ఆహ్వానంపై బండ్ల గణేశ్ కౌంటర్
‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ గెలిస్తే 10 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకాశ్‌రాజ్ ఈ సమావేశంలో పేర్కొన్నారని తెలిసింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, జీవిత, హేమ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్యానెల్‌లోని 26 మందితో పని చేయడం కాదు. ఇంకో 200 మందితో పని చేయించేవాడు నిజమైన నాయకుడు అవుతాడు. పెద్ద హీరోలు గతంలో ‘మా’ ఎలక్షన్స్‌లో ఎందుకు పాల్గొనలేదో విశ్లేషించుకున్నాం. వారితో మాట్లాడాం. ఈసారి వారు కూడా ఎలక్షన్స్‌లో పాల్గొంటారనే నమ్ముతున్నాను. ‘మా’ ఉన్నతికి నేను, నా ప్యానెల్ రావడమే కాదు. వారి బాధ్యత కూడా ఉంది.
చదవండి: ప్రమాద సమయంలో సాయి తేజ్‌కు సాయం చేసింది ఈ ఇద్దరే
ఈ నెల 19న ‘మా’ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. వచ్చిన తర్వాత నా మేనిఫెస్టోను తెలియజేస్తాను’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ కరోనా సమయంలో విందుభోజనాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదన్న బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ స్పదించారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలు విని షాక్ అĶæ్యనని, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కనిపిస్తున్న ర్యాలీలపై కూడా బండ్ల గణేశ్ స్పందిస్తే బాగుంటుందని ప్రకాశ్‌రాజ్ అన్నారు. కోవిడ్ నియమ నిబంధనల ప్రకారమే తాము సవవేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment