‘మా’ ఎన్నికలు: సీవీఎల్‌ నరసింహ రావు ఆసక్తికర వ్యాఖ్యలు | MAA Elections 2021: CVL Narasimha Rao Comments On MAA Elections 2021 | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: సీవీఎల్‌ నరసింహ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Oct 5 2021 4:31 PM | Last Updated on Tue, Oct 5 2021 8:56 PM

MAA Elections 2021: CVL Narasimha Rao Comments On MAA Elections 2021 - Sakshi

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(మా) ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో మా ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రచారాలు, ఆరోపణలు వరకు ఉండే ఎన్నికలు ఈ సారి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ఈ రోజు ఉదయం ప్రకాశ్‌ రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ.. మంచు విష్ణు ప్యానల్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందంటూ ఆరోపించగా.. బ్యాలెట్‌ పేపర్‌ విధానం ద్వారానే ‘మా’ ఎన్నికలు జరిపించాలని కోరుతూ మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాశాడు. ఇలా అభ్యర్థులు ఒకరిపై ఒకరూ ఫిర్యాదు చేసుకుంటుండగా.. మరోవైపు సీవీఎల్‌ నరసింహ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: ‘మా’ ఎన్నికల అధికారి మంచు విష్ణు లేఖ

ఫిలించాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ సభ్యుడిగా రెండు ప్యానల్స్‌కు నాదోక విన్నపం. మురళీ మోహన్‌ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యుల కోసం ఒక రిజల్యూషన్‌ పాస్‌ చేయడం జరిగింది. వాటిని ఈ సారి కూడా అమలు చెయాలి. ఏ ప్యానల్‌ గెలిచిన బిల్డింగ్‌ కట్టడానికి రూ. 6 కోట్లు ఇవ్వడానికి ఒక అభిమాని సిద్దంగా ఉన్నారు. హెల్త్‌ ఇన్యూరెన్స్‌ పక్కాగా అమలు పరచడం.. ఏ సభ్యుడు కూడా ఆకలితో భాధ పడకుండా వాళ్లను వెంటనే ఆదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలి’.. ఎవరూ గెలిచినా ఈ ప్రణాళికలు అమలు చేయాలని కోరుతున్నా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మొదట ‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నరసింహ రావు నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ వేసిన మూడో రోజుకే ఆయన అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటూ నామినేషన్‌ ఉపసంహరించుకున్నాడు. 

చదవండి: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement