'మా' ఎన్నికలు:  ఎన్టీఆర్‌ ఓటుపై జీవిత ఆసక్తికర వ్యాఖ్యలు | MAA Elections 2021: Jeevitha Rajasekhar Interesting Comments On Jr NTR | Sakshi
Sakshi News home page

MAA Elections 2021:  ఎన్టీఆర్‌ ఓటుపై జీవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Oct 5 2021 12:53 PM | Last Updated on Tue, Oct 5 2021 5:50 PM

MAA Elections 2021: Jeevitha Rajasekhar Interesting Comments On Jr NTR - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు దగ్గపరపడుతున్న కొద్ది ఇరు ప్యానల్‌ సభ్యుల మధ్య మాటల యుద్దం తీవ్రమవుతుంది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘మా’ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మంచు విష్ణు టాలీవుడ్‌ పెద్దలను కలుస్తూ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కృష్ణంరాజులను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు. ప్రకాశ్‌ రాజు మాత్రం తనకు తనకు ఎవ్వరి సపోర్ట్‌ అవసరం లేదని మీడియా ముందే చేప్పేశారు. కానీ, మెగా ఫ్యామిలీ మాత్రం పరోక్షంగా ప్రకాశ్‌ రాజుకు మద్దతు ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే.
(చదవండి: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు)

ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్‌ ‘మా’ఎన్నికలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అక్టోబర్‌ 10న జరగబోయే ఎన్నికలపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిప్రాయం ఏంటో ఆమె బహిర్గతం చేసింది. ఇటీవల ఓ పార్టీలో ఎన్టీఆర్‌ను కలిశానని చెప్పిన జీవిత... ‘మా’ ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం చెప్పి ఓటు వేయాలని అభ్యర్థించగా, ప్రస్తుత పరిస్థితులపై ఆయన అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని అన్నారని, ఓటు వేసేందుకు రానని ఆయన తేల్చి చెప్పారని జీవిత పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ చెప్పినట్లు ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ‘మా’ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందకు తీసుకువస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement