మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ఇంకా రెండు రోజులే మిగిలున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ‘మా’ ఎలక్షన్స్ రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అధ్యక్ష బరిలో దిగుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లు నువ్వా-నేనా? అన్నట్లుగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక సినీ పెద్దలు కొందరూ ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానల్లకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘మా’ ఎన్నికలపై స్పందించారు. చిత్తూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు.
చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు
ఈ మేరకు రోజా.. ‘మూవీ ఆర్టిస్ట్‌గా తప్పకుండా ‘మా’ ఎన్నికల్లో పాల్గొంటాను. రెండు ప్యానల్‌లు తమ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఎవరి మ్యానివేస్టో ‘మా’ అసోసియేషన్ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ ప్యానల్‌కే ఓటు వేస్తాను’ అని స్పష్టం చేశారు. అలాగే లోకల్, నాన్ లోకల్‌లో ఎవరికి ఓటు వేస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా.. వివాదస్పద ప్రశ్నలు తనని అడగొద్దని తెలిపారు. ఎందుకంటే ఈ సారి ‘మా’ ఎన్నికలుసాధారణ ఎన్నికల కంటే వాడివేడిగా సాగుతున్నాయని, అందుకే దీనిపై తాను ఏం మాట్లాడాలనుకోవడం లేదన్నారు. కానీ ఓ ఆర్టిస్ట్‌గా తాను ఖచ్చితంగా ‘మా’ ఓటును సద్వీనియోగం చేసుకుంటానని, ఎవరి మేనిఫెస్టో ‘మా’ అభివృద్దికి ఉపయోగపడేలా ఉంటుందో ఆ ప్యానల్‌కే ఓటు వేస్తానని రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment