ఏపీ ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ‘మా’ సభ్యులు వ్యక్తిగత దూషణలు చేసకోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమె ‘ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయి. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. రెండు ప్యానళ్లో నాతో పని చేసిన వారు, తెలిసిన వారు ఉన్నారు. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలి. సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళ్లాలి. చివరికి అందరం కలిసి కట్టుగా ఉండి మన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. కళాకారులకు, ఆర్టిస్ట్‌లుకు పూర్వ వైభవం రావాలి. ఇకనైనా వెంచర్స్ పాలిటిక్స్ ఆపెయండి. గతంలోని పాలకవర్గంలో పెద్దవారిని, గోప్ప నటులను ఆదర్శంగా తీసుకోని పరిశ్రమను అభివృద్ది వైపు నడిపించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment