MAA Elections: Prakash Raj Comments on His New Panel Members Sudhir And Anasuya - Sakshi
Sakshi News home page

MAA Elections 2021 :అందుకే సుడిగాలి సుధీర్‌, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్‌ రాజ్‌

Published Sat, Sep 4 2021 12:24 PM | Last Updated on Sat, Sep 4 2021 12:59 PM

MAA Elections: Prakash Raj Comments on His New Panel Members Sudhir And Anasuya - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల తేది(అక్టోబర్‌ 10)దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేశాడు. శుక్రవారం సిని‘మా’బిడ్డలు అనే పేరుతో  తన ప్యానల్‌ సభ్యులను కూడా ప్రకటించారు. అందులో ప్రకాశ్‌రాజ్‌ (అధ్యక్షుడు), నాగినీడు (ట్రెజరర్‌), బెనర్జీ, హేమ (ఉపాధ్యక్షులు), శ్రీకాంత్‌ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), జీవితా రాజశేఖర్‌ (జనరల్‌ సెక్రటరీ), అనితా చౌదరి, ఉత్తేజ్‌ (జాయింట్‌ సెక్రటరీ). ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా అనసూయ, అజయ్, బి.భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి.సుబ్బరాజు, సురేశ్‌ కొండేటి, తనీశ్, టార్జాన్‌ ఉన్నారు.
(చదవండి: అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ)

అయితే వీరిని మాత్రమే ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. కొత్త వారికి, కుర్రాళ్లకి, మహిళలకు, బుల్లితెరకు అందరికీ ఇలా సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్యానెల్‌ను డిజైన్ చేశామని ప్రకాశ్‌ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో బుల్లితెర యాంకర్‌ అనసూయ, నటుడు సుధీర్‌లను ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మెంబర్స్‌గా ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. ‘అనసూయ గొప్ప యాంకర్‌ .అందరితో కలిసి మాట్లాడగలికే శక్తి ఉన్న లేడి. బుల్లితెర నటీనటుల కష్టాలు ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమెను సెలెక్ట్‌ చేశాం’అన్నారు. ఇక సుధీర్‌ గురించి మాట్లాడుతూ..‘యూత్‌ ఐకాన్‌ సుధీర్‌. అలాంటి కుర్రాళ్లతో కలిసి పని చేస్తే మాక్కుడా కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చే తరాలకు వీళ్ల ఐడియాలు పనికొస్తాయి. ఆ కారణంగానే సుధీర్‌ని సెలెక్ట్‌ చేశాం’అని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement