MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్‌రాజ్ తాజాగా ఆయన ప్యానల్ సభ్యులతో కలిసిజూబ్లీహిల్స్ స్కూల్‌కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ తమకు అందించాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ను డిమాండ్ చేశారు.అయితే మంచు విష్ణు లేనందున ఇరువురి సమక్షంలో మాత్రమే సీసీ ఫుటేజీ ఇస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.
ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌కు సీసీటీవీ ఫుటేజీని ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్‌కు పోలీసులు సైతం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీసీ ఫుటేజీని ప్రిజర్వ్ చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్‌కు పోలీసులు సైతం చేరుకున్నారు.
కాగా, అలాగే ప్రుకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్ రాజ్ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు.
ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఈనెల 10న జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు
పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన మంచు విష్ణు
Comments
Please login to add a commentAdd a comment