
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 83శాతానికి పైగా పోలింగ్ (మధ్యాహ్నం 3గంటల వరకు) నమోదయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేయడం ఇదే తొలిసారి. వీరిలో ఎక్కువ మంది ఓటింగ్ మంచు విష్ణుకు ప్లస్ అవుతుందని సమాచారం.
తొలిసారి ఇంత భారీ పోలింగ్ నమోదవడం మంచి పరిణామమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అవుతుందని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. మంచు విష్ణు ప్యానలే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment