మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ సారి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు, ఫిర్యాదులతో పాటు వ్యక్తిగత దూషణలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఈ సారి లోకల్-నాన్ లోకల్ అనే అంశం కూడా ఎన్నికల్లో వినిపిస్తోంది. దీంతో చివరికి మా అధ్యక్షు పీఠం ఎవరికి దగ్గనుందనేది ఆసక్తిగా మారింది. ఇక మా ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నటుడు జీవిత రాజశేఖర్ తొలిసారిగా మా ఎన్నికలపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా ఆయన భార్య జీవిత, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: అందుకే ప్రకాశ్ రాజ్ మేనిఫెస్టో విడుదల చేయలేదు: జీవిత
ఈ క్రమంలో ప్రకాశ్ ప్యానల్ నిర్వహించి ప్రెస్‌మీట్‌లో రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట తాను ఏ ప్యానల్‌కు సపోర్టు చేయకూడదని, ‘మా’ ఎన్నికల విషయంలో న్యూట్రల్‌గా ఉండాలనుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం ‘తెలుగు సినీ ఇండస్ట్రీ మరింత కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలంటే మా అసోసియేషన్‌కు తగిన అధ్యక్షుడు కావాలి. అసోసియేషన్ అధ్యక్ష పీఠం పెత్తనం కోసం కాదు.. అదొక బాధ్యత. సభ్యుల సంక్షేమం, మా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడే పదవి. అందుకే నేను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. కానీ అదే సమయంలోనే ప్రకాశ్ రాజ్ మా ఇంటికి వచ్చారు.
చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే
‘మా’ అసోసియేషన్ సంక్షేమం కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారో వివరించారు. ప్రకాశ్ రాజ్ ఆలోచనలు విన్న తర్వాత నా మనసు మార్చుకున్న. ‘మా’ అధ్యక్ష పదవికి ఆయనే తగిన వాడని అనిపించింది. అందుకే ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాను. ‘మా’ అసోసియేషన్ అభివృద్ధికి చాలా డబ్బులు అవసరం. అందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకాశ్ రాజ్‌కు వివిధ సినిమా ఇండస్ట్రీలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఫండ్ రైజింగ్ కోసం ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహించగలరు. అందుకే ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ప్రకటిస్తున్నాను. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీ చేస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment