
Prakash Raj Maa Elections 2021 Panel List: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల పర్వం షురూ అయ్యింది. 'మా' అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే ఆయన తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నమే సీవీఎల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అయితే మంచు విష్ణు రేపు(సెప్టెంబర్28)న మధ్యాహ్నాం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది. అక్టోబర్1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 10న 'మా' ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు
మెయిన్ ప్యానల్ సభ్యులు:
1. అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్
2. ట్రెజరర్-నాగినీడు
3. జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్
4. ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
5. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
6. జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ప్రకాశ్ రాజ్ ఎక్స్‌క్యూటివ్ మెంబెర్స్ జాబితా ఇదే:
1. అనసూయ
2. అజయ్
3. భూపాల్
4. బ్రహ్మాజీ
5. ప్రభాకర్
6. గోవింద రావు
7. ఖయూమ్
8. కౌశిక్
9. ప్రగతి
10. రమణా రెడ్డి
11. శివా రెడ్డి
12. సమీర్
13. సుడిగాలి సుధీర్
14. సుబ్బరాజు. డి
15. సురేష్ కొండేటి
16. తనీష్
17. టార్జాన్