
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇరు ప్యానల్స్‌కు చెందిన సభ్యుల నుంచి ఎవరోర ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్‌లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించగా.. ఓడిపోతామనే భయంతో ప్రకాశ్ రాజ్ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విమర్శించారు.
(చదవండి: ‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు)
ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన హేమ.. బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలతో ఓ వీడియోను విడుదల చేశారని ఆమె లేఖలో తెలిపారు. కళ్యాణి, నరేశ్‌లపై చర్యలు తీసుకోవాలని హేమ విజ్ఞప్తి చేశారు.