
బంజారాహిల్స్: ఈ నెల 10వ తేదీన జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. ఇందుకోసం జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మూడు గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒకేసారి ఒక గదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
(చదవండి: బిగ్ ట్విస్ట్.. ‘మా’కు సీవీఎల్ షాక్)
పోలీస్ బందోబస్తు కోసం మూడు ప్లటూన్లు వినియోగిస్తున్నారు. ఇందులో ఒక ఉమెన్ ప్లటూన్ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 883 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా మా ఎన్నికలకు సంబంధించి ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ప్రతినిధులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులతో ఓటింగ్ జరగనున్న ప్రాంతంలో సమావేశం అయ్యారు. వీరితో పా టు నటుడు మురళీ మోహన్, శ్రీకాంత్, నరేశ్, జీవితా రాజశేఖర్ తదితరులు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment