
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల పోలింగ్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్ రాజ్, ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేశ్ మధ్య వివాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువరు వాగ్వాదానికి దిగారు. అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ప్యానల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఓ వ్యక్తి పోలింగ్‌లో రిగ్గింగ్ పాల్పిడినట్లు విష్ణు ప్యానల్ ఆరోపించారు. సభ్యుడు కానీ వ్యక్తులు కూడా పోలింగ్ బూత్‌కు వచ్చినట్లు పేరొన్నాడు. అంతేగాక పోలింగ్ కేంద్రం ముందు ఇరు ప్యానల్ సభ్యుల మధ్య గొడవలు తలెత్తడంతో కేంద్రం బయటక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విష్ణు ప్యానల్ సభ్యుడు, నటుడు శివ బాలజీ చేతిని గుర్తు తెలియని వ్యక్తి కొరికినట్లు నరేశ్ ఆరోపణలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment