మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానంటూ మంచు విష్ణు మండిపడ్డారు. తాజాగా మంచు విష్ణు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షులు నరేశ్ సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తామే తప్పకుండా గెలుస్తామని థీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి తన బంధువా? కాదా? అనే దానిపై విష్ణు స్పందిస్తూ.. దీనిని ఆయననే రుజువు చేయమని, తన ఫ్యామిలీ గురించి తనకంటే ఎక్కువగా ఆయన తెలుసు అనుకుంటా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అలాగే ప్రతి పక్షంలో ఉన్న వ్యక్తి తనని, తనని ఫ్యామిలీపై కూడా విమర్శలు చేస్తున్నారని, ఆయనకు తానేంటో త్వరలోనే చూపిస్తా అంటూ సవాలు విసిరారు. తాను చేసేది తప్పు అయితే తనని, ఎన్నికల అధికారిన సస్పెన్స్ చెయొచ్చని విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారనుకున్నామని, కానీ 560మంది వచ్చారన్నారు. అందరూ ‘మా’ సభ్యులే అని వారంతా తనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను పిలిచి తనకెందుకు ఓటు వేయాలో చెప్పానని, వాళ్లకు నచ్చితే వేస్తారన్నారు. ఈసారి ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేస్తున్నారని, తన హామిలన్ని అమలు కావాలంటే తన ప్యానల్ మొత్తం గెలవాలంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.
అలాగే నరేశ్ కూడా మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నామన్నారుఉఉ. ఇరు ప్యానెల్ వర్గాలు కూడా వచ్చాయని, ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుందని, మధ్యాహ్నం 2గంటలకు ముగుస్తుందని చెప్పారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని, నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని మొదట అనుకున్నామని, కానీ వర్షాల కారణంగా అందరి ఆమోదంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఎవరి ప్రచారాన్ని వాళ్లు ముగించుకుని నేడు ఏర్పాట్లలోనే ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment