
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) భనన నిర్మాణంపై సీనియర్ హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికి అమ్మేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన ‘మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. మా భవనం కోసం స్థలం కొని మళ్లీ అమ్మేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
(చదవండి: అన్నగా పుట్టినప్పటికీ తండ్రిలా సాకారు.. పవన్ ఎమోషనల్ పోస్ట్)
బిల్డింగ్ కోసం కూడబెట్టిన డబ్బుతో స్థలం కొని దాన్ని సగం ధరకు అమ్మడంపై పెద్దలు ఆలోచించాలని కోరారు. అతి త్వరలో మా ఎన్నికలు పెడతారని భావిస్తున్నానని చెప్పిన మోహన్ బాబు... దీనిపై అభిప్రాయాలు తీసుకుని కృష్ణం రాజు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
వాడివేడిగా జరిగిన మా అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఎన్నికలపై మా సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే వారంలోగా ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని కృష్ణంరాజు, మురళీమోహన్ పేర్కొన్నారు. మరోవైపు 'మా' అసోసియేషన్ భేటీ జరిగిన 21 రోజుల్లో ఎన్నికలు పెట్టాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 12 లేదా 19న 'మా' ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ సైతం ఎన్నికలు ఎంత తొందరగా పెడితే అంత మంచిది అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment