
ప్రచారం, విమర్శలు, ఆరోపణలతో వాడివేడిగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తాజాగా సీవీఎల్ నర్సింహ రావు వ్యాఖ్యలతో మరింత ఆసక్తిగా మారాయి ‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫిలించాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను ఓటు వేయానన్నారు. ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చాలా బాధను కలిగిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో నిలబడితే తాను మాత్రమే ఓడిపోతాననుకున్నాను అన్నారు.
చదవండి: నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం
కానీ తాను మౌనంగా ఉండిపోతే మా సభ్యులు అందరూ ఓడిపోతారని ఇన్ని ప్రయత్నాలు చేశానన్నారు. అయినా ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చూసి అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ విషయంలో చివరికి తానే గెలుస్తాననే నమ్మకం ఉందని, ఎన్నికల్లో కొంత మంది గెలిచి కొంత మంది ఓడిపోతే ప్రతి వాళ్ళు ఓడిపోతారన్నారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల ఆశిస్సులతో ‘మా’ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశభావం వ్యక్తం చేశారు.
చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
ఒకవేళ ఎన్నికల్లో ఇలాంటి గందరగోళ పరిస్థితులే కొనసాగితే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సీవీఎల్ నర్సంహి రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎవరూ గెలిచిన మాలో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లాలని రెండు ప్యానల్‌లను కోరుతూ ఫిలించాంబర్‌లో మీడియాతో ముచ్చటించిన ఆయన తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.