MAA Elections 2021: Prakash Raj Press Meet Over MAA Elections - Sakshi
Sakshi News home page

MAA Elections: ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్లోకి కొత్త సభ్యులు

Published Fri, Sep 3 2021 4:56 PM | Last Updated on Fri, Sep 3 2021 6:29 PM

MAA Elections: Prakash Raj Press Meet Over MAA Elections - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ‘మా’అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఆ పగ్గాలు ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ వివాదాలకు తెరలేపారు.  ఈ క్రమంలో ఎన్నికల తేదీని ‘మా’ క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్‌ రాజ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తమ ప్యానల్‌ సభ్యులను వెల్లడించారు.

మెయిన్ ప్యానల్ సభ్యులు:

1. అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్‌

2. ట్రెజరర్‌-నాగినీడు

3. జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌

4. ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ

5. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌

6. జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌
 

ప్రకాశ్‌ రాజ్‌ ఎక్స్‌క్యూటివ్‌ మెంబెర్స్ జాబితా ఇదే:

1. అనసూయ
2. అజయ్
3. భూపాల్
4. బ్రహ్మాజీ
5. ప్రభాకర్ 
6. గోవింద రావు 
7. ఖయూమ్
8. కౌశిక్
9. ప్రగతి
10. రమణా రెడ్డి
11. శివా రెడ్డి
12. సమీర్
13. సుడిగాలి సుధీర్
14. సుబ్బరాజు. డి
15. సురేష్ కొండేటి
16. తనీష్
17. టార్జాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement