
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మా ఎన్నికలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏ వ్యక్తిని కాని, ఏ వర్గాన్ని కానీ సమర్థించడం లేదన్నారు.. మరోవైపు మా ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ మంచు విష్ణు రెబెల్ స్టార్ కృష్ణం రాజును కలిశారు.
ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ..తనకు కృష్ణం రాజు ఆశీస్సులు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పెద్దల ఆశీర్వాదం తనకొద్దని, మా ఎన్నికల్లో తన సత్తాపైనే గెలుస్తానని ప్రకాశ్‌రాజ్ కామెంట్స్ చేశారు. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
MAA Elections 2021: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు