నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా: పూనమ్‌ కౌర్‌ | MAA Elections 2021: Actress Poonam Kaur Tweet About Prakash Raj Over MAA Elections | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: అప్పుడే నా సమస్యల్ని బయటపెడతా: పూనమ్‌

Published Fri, Oct 1 2021 9:20 PM | Last Updated on Fri, Oct 1 2021 9:43 PM

MAA Elections 2021: Actress Poonam Kaur Tweet About Prakash Raj Over MAA Elections - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన గెలిచాక తాను ఎదుర్కొన్న  సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొంది. తాజాగా ఆమె ట్వీట్‌ చేస్తూ ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేసింది. ఈ మేరకు ఆమె ‘‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఇంతకాలం నిశబ్థం ఉన్న నాకు ఆయన గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం వస్తుంది.

చదవండి: బికినీ ఫొటో అడిగిన అభిమానికి అనుపమ ఘాటు రిప్లై

ఎందుకంటే ఆయన మాత్రమే వాస్తవికంగా ఉంటారని నా నమ్మకం. ప్రకాశ్ రాజ్‌కు పెద్దల పట్ల గౌరవం, ఇచ్చిన మాట కు కట్టుబడి ఉంటారు. ఆయన ప్రకాశ్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరు. అందుకే ఆయనకు తన మద్దతు ఉంటుంది. జైహింద్‌’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కాగా పంజాబీ భామ అయిన పూనమ్‌ హీరో శ్రీకాంత్‌ ‘మాయాజాలం’ మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘వినాయకుడు, శౌర్యం, గణేశ్, గగనం, శ్రీనివాస కల్యాణం’ వంటి చిత్రాల్లో సహానటిగా కనిపించింది. ఇక ప్రకాశ్‌ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10 మా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌తో పాటు హీరో మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావులు పోటీ పడుతున్నారు.

చదవండి: ‘మా’ ఎన్నికలు: కృష్ణను కలిసిన మోహన్‌బాబు, విష్ణు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement