సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపిస్తున్నాయి. మంగళవారం నామినేషన్‌ల పర్వం కూడా ముగియడంతో బరిలో దిగుతున్న మంచు విష్ణు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ల సభ్యులు ప్రచారంలో బిజీగా అయిపోయారు.
చదవండి: 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు
ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. కాగా ఇప్పటికే ఆయన మంచు విష్ణు ప్యానల్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మీడియా సమావేశంలో నరేశ్, మంచు విష్ణుతో పాటు విష్ణు ప్యానల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘ఎవడు పడితే వారు సీటులో కూర్చుంటే ‘మా’ మసక బారుతుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో కొంతమంది శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్ మద్దతు
‘విష్ణు ప్యానల్‌లో ఎంతో మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. ‘మా’కు మంచి వారసుడు కావాలి. ‘మా’ లో పదవి వ్యామోహలు ఉండకూడదు. ఒక గ్రూపు స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది. అన్ని ప్రశ్నలకు ‘మా’ ఎన్నికలే సమాధానం. ‘మా’కు ఇప్పటి వరకు ఒక మచ్చ కూడా లేదు. నేను వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు 6 నెలల పాటు సర్వే చేసి వెల్ఫేర్ కమిటీని విజయవంతం చేశాం. పెద్దలు మంచి మైక్‌లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్న మాటలకు నేను నా నోటికి తాళం వేసి కూర్చునున్నాను. విష్ణు ప్యానల్ బాగుంది. అందుకే మంచు విష్ణు ప్యానల్‌కు నా మద్దతు ఇస్తున్నాను’ అంటూ నరేశ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment