
Maa elections 2021: మోహన్ బాబు సమక్షంలో మా ఎన్నికలు జరిగాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ కలిసి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇక కథ ముగిసింది అనుకుంటే మరో కొత్త కథ తెరమీదకు వచ్చింది. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే మా సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఆలోచనలపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్‌పై టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం చెప్పబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మరోవైపు ఓటమికి జీర్ణించుకోలేక ఇలా కొత్త అసోసియేషన్ వైపు అడుగులు వేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఒకవేళ ప్రకాశ్‌రాజ్ కొత్త అసోసియేషన్ ప్రకటిస్తే టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోనుందనే టాక్ కూడా ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: ఈ కారణాల వల్లే ప్రకాశ్‌రాజ్ ఓడిపోయాడా?
Comments
Please login to add a commentAdd a comment