Manchu Vishnu Files His Nomination In Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ ప్యానల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటం అని, తన మ్యానిఫెస్టో చూశాకా చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా తనకే ఓటేస్తారని విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ మా అధ్యక్ష పదవికి నామినేషన్ సమర్పించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న 'మా' ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
మంచు విష్ణు ప్యానల్ ఇదే
అధ్యక్షుడు : మంచు విష్ణు
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్
జనరల్ సెక్రటరీ: రఘుబాబు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: బాబు మోహన్
ట్రెజరర్: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్ రాజు
చదవండి : 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు
Maa Elections 2021: ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నామినేషన్ దాఖలు.. లిస్టులో ఉన్నది వీరే..
Comments
Please login to add a commentAdd a comment