
వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని, వివాదాలతో చులకన కావద్దని సూచించారు....
MAA Elections 2021 Results: చివరి వరకు ఉత్కంఠగా సాగిన 'మా' పోరులో మంచు విష్ణుదే పైచేయి అయింది. భారీ మెజారిటీతో ప్రకాశ్ రాజ్‌ను ఓడించి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు హీరో విష్ణు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'పెళ్లిసందD' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మా ఎన్నికలను ఉద్దేశిస్తూ.. పదవులు తాత్కాలికమని, అల్లర్లతో 'మా' పరువు తీయొద్దని కోరారు.
మన ప్రభావాన్ని చూపించడానికి వేరేవారిని కించపరచవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని, వివాదాలతో చులకన కావద్దని సూచించారు. మనమంతా వసుధైక కుటుంబం అని చెప్పిన చిరు, ఇలాంటి ఘటనల వల్ల బయట వాళ్లకు లోకువ అవుతామని నొక్కి చెప్పారు.