
MAA Elections 2021 Manchu Vishnu Press Meet: నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను తాను ఆమోదించనని మంచు విష్ణు అన్నారు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో తనను విత్ డ్రా చేసుకోమని చిరంజీవి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం చెప్పకూడదనుకున్నానని, అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్ననని పేర్కొన్నారు. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..
ఇక రామ్‌చరణ్ తనకు మంచి స్నేహితుడు అయినప్పటికీ తండ్రి మాటకు కట్టుబడి ప్రకాశ్‌రాజ్‌కే ఓటేసి ఉండేవచ్చన్నారు. రామ్‌చరణ్ స్థానంలో ఉంటే తాను కూడా ఇదే చేసి ఉండేవాడినన్నారు. ఇక తన గెలుపుకు వంద శాతం కారణం తన తండ్రి మోహన్ బాబు అని చెప్పారు. అనంతరం నరేష్ తన గెలుపుకు ఎంతో కష్టపడినట్లు తెలిపారు. చదవండి: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
'మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. గెలుపొందేందుకు మా ప్యానల్ అందరం కష్టపడ్డాం. కానీ మా ప్యానల్‌లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో గెలిచిన వారిని కలుపుకొని పోతాం. మేమంతా ఒక్కటే.
ఇక ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి, అవేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించను. త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతా. అలాగే ప్రకాశ్ రాజ్ రాజీనామాను కూడా ఆమోదించను. ఆయన సలహాలను కూడా స్వీకరిస్తా' అని పేర్కొన్నారు. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ